మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే

Published on Thu, 08/03/2023 - 15:44

మలక్‌పేట నియోజకవర్గం

మలక్‌పేట సిటింగ్‌ ఎమ్మెల్యే, మజ్లిస్‌ నేత అహ్మద్‌ బలాలా మూడోసారి గెలు పొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది ముజఫర్‌ అలీపై 17572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బలాలాకు 53281 ఓట్లు రాగా, ముజఫర్‌ అలీకి 29769 ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసింది. ఇక్కడ బిజెపి పక్షాన పోటీ చేసిన ఆలె జితేంద్రకు సుమారు 20900 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఏడు స్థానాలలో మజ్లిస్‌ పట్టు నిలుపుకోగా, వాటిలో మలక్‌పేట ఒకటి. అహ్మద్‌ బలాలా ముస్లిం నేత. నియోజకవర్గాల పునర్విభజన తరువాత మలక్‌పేట నియోజకవర్గం పూర్తిగా ఎమ్‌.ఐ.ఎమ్‌కు అనుకూలంగా మారింది. దాంతో తొలిసారిగా 2009లో ఇక్కడ నుంచి మజ్లిస్‌ పక్షాన అహ్మద్‌బిన్‌ అబ్దుల్‌ బలాల మూడోసారి కూడా ఎన్నికయ్యారు.

గతంలో మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్‌.ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు, మల్‌రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు గెలిచారు. మల్‌రెడ్డి ఒకసారి టిడిపి తరుఫున, మరోసారి కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలిచారు. సరోజిని పుల్లారెడ్డి, మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌,కె. ప్రభాకర్‌రెడ్డిలు మంత్రి పదవి నిర్వహించిన వారిలో ఉన్నారు. ప్రభాకరరెడ్డి డిప్యూటీ స్పీకరు పదవి కూడా చేసారు. జనతా పార్టీ పక్షాన గెలిచిన ఈయన తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఇక్కడ గెలుపొందిన సుధీర్‌కుమార్‌ కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ కుమారుడు.

శివశంకర్‌ గతంలో సికింద్రాబాద్‌, తెనాలి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. సిక్కిం, కేరళ గవర్నరుగా కూడా పనిచేసారు. తదుపరి కాలంలో  ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈయన మరో కుమారుడు డాక్టర్‌ వినయ్‌కూడా ప్రజారాజ్యంలో చేరి నిజామాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో ముషీరాబాద్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మలక్‌పేటలో ఇప్పటివరకు  కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి ఆరుసార్లు, బిజెపి మూడుసార్లు,మజ్లిస్‌ మూడుసార్లు పిడిఎఫ్‌, జనతా, టిడిపిలు ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ ఎనిమిదిసార్లు రెడ్లు, ఆరుసార్లు ముస్లింలు, ఒకసారి బిసి(మున్నూరు కాపు) నేతలు గెలుపొందారు.

మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)