Breaking News

మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్‌‌

Published on Thu, 01/15/2026 - 14:49

సాక్షి, హైదరాబాద్‌: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్ చిట్‌ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్‌.. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్‌ తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు స్పీకర్‌ ఇచ్చారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్‌లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్‌ తీర్పు చెప్పనున్నారు.

పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్‌ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇచ్చారు. తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్‌ తీర్పు ఇచ్చారు.

మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్‌(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.

అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్‌ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్‌చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్‌), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్‌) పిటిషన్లను స్పీకర్‌ కొట్టిపారేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)