Breaking News

TS:రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌..మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ క్లారిటీ

Published on Tue, 12/12/2023 - 13:04

సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్‌ సప్లై అధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్‌ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్‌ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్‌ అధికారులకు సూచించారు. 

‘గత ప్రభుత్వం సివిల్‌ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్‌ తెలిపారు. 

ఇదీచదవండి..జనార్ధన్‌ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చిన తమిళిసై

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)