Breaking News

Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: ఊహించని ఫలితాలు

Published on Sat, 06/01/2024 - 18:54

తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి.  

ఆరా మస్తాన్‌ సర్వే

ఆరా మస్తాన్‌ సర్వే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం​.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను  బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.

పోల్‌ లాబొరేటరీ

పోల్‌ లాబొరేటరీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.

ఇండియా టుడే

ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10,  బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.

పోల్‌ స్టార్ట్‌

బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్‌ స్టార్ట్‌ స్పష్టం చేసింది.

పార్థ చాణక్య

పార్థ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.

ఆపరేషన్‌ చాణక్య 

ఆపరేషన్‌ చాణక్య ప్రకారం.. కాం‍గ్రెస్‌ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్‌ 5-8, బీఆర్‌ఎస్‌ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.

ఏబీపీ సీ ఓటర్‌

ఏబీపీ సీ ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.

న్యూస్‌ 24

న్యూస్‌ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.

ఎక్కడా కనిపించని కారు జోరు

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)