Breaking News

ఓటర్ల స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోంది: వికాస్‌ రాజ్‌

Published on Thu, 11/23/2023 - 16:27

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు. 

తాజాగా వికాస్‌రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్‌ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్‌ టైం హోం ఓటింగ్‌ నిర్వహిస్తున్నాం. మొత్తం 3 కోట్ల 26లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 9 లక్షలకు పైగా యంగ్‌ ఓటర్లు ఎక్కువగా ఉ‍న్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్‌ అయ్యాయి. ఎపిక్‌ కార్డులు 51 లక్షలు ప్రింట్‌ అయ్యి దాదాపు పంపిణీ అయ్యింది. ముగ్గురు స్పెషల్‌ అబ్జర్వర్లు స్టేట్‌కు వచ్చారు. ప్రతీ కౌంటింగ్‌ సెంటర్‌కు ఒక అబ్జర్వర్‌ ఉంటారు. మూడు కేటగిరీల్లో హోం ఓటింగ్‌ జరుగుతోంది. 9300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్‌ స్లిప్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. ఎల్లుండి వరకు ఓటర్‌ స్లిప్‌ పంపిణీ పూర్తి అవుతుంది. 

తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 59వేల బ్యాలెట్‌ యూనిట్లు వాడుతున్నాం. రేపటి వరకు కమీషనింగ్‌ పూర్తి అవుతుంది. సీ విజిల్‌ యాప్‌ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ వెహికిల్‌కు జీపీఎస్‌ ఉంటుంది. ప్రతీ సెగ్మెంట్‌కు మూడు ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌ ఏర్పాటుచేశాం.  ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్‌లో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రఫోజల్స్ వచ్చాయి. నిర్ణయం ECI ఇంకా తీసుకోలేదు. 64వేలు స్టేట్ పోలీసులు, 375కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి’ అని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)