Breaking News

మాకూ కేబినెట్‌లో చోటివ్వండి..!

Published on Thu, 05/29/2025 - 16:28

ఢిల్లీ : తెలంగాణ కేబినెట్ విస్తరణ పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది.  తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి  కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపి ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ కేబినెట్ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి క్యూకట్టిన తరుణంలో ఆ నివేదికను అధిష్టానం పక్కన పెట్టేసింది.  

అయితే ప్రస్తుతం మాదిగ కులానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు. తమ కులానికి కూడా కేబినెట్ లో పెద్ద పీట వేయాలని వారు పట్టుబడుతున్నారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమ కులానికి అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పెద్దలను కలవడానికి వారు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు.

మాది న్యాయమైన డిమాండ్..
‘మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, పీసీపీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కి తెలిపే ఢిల్లీ వచ్చాం. మాది న్యాయమైన డిమాండ్. మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాలి. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలి. 

మాదిగ వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా ఉంది. మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మాకు అభ్యంతరం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి  ఢిల్లీ వచ్చాం. మంత్రివర్గంలో మాదిగలకు కచ్చితంగా స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాం. మొదటి కేబినెట్ ఏర్పాటులో  మాకు అవకాశం దక్కుతుందని భావించాం. ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గంలో ఏ  ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు’ అని వారు స్పష్టం చేశారు.  

అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వం పల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు ఢిల్లీకి  వెళ్లిన వారిలో ఉన్నారు,. ఈరోజు(గురువారం) అధిష్టానం పెద్దలను వీరు కలిసే అవకాశం ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)