Breaking News

టార్గెట్‌ లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ బీజెపీ అభ్యర్థుల జాబితా రెడీ?

Published on Wed, 01/31/2024 - 11:48

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.  

ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్‌ రెడ్డి, బం‍డి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది.

ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)