Breaking News

తీవ్ర ఉత్కంఠ.. బీజేపీ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు

Published on Sat, 10/21/2023 - 17:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్‌ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది.

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చూపించారు.

అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం.

సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)