Breaking News

TS: పార్లమెంట్‌ ఎన్నికలు..పొత్తులపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Fri, 12/15/2023 - 13:19

సాక్షి,హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార‌్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. 

‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు.  మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. 

ఇదీచదవండి..‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్‌ కీలక ప్రకటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)