Breaking News

బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?

Published on Thu, 11/30/2023 - 19:37

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేయగా,  ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్‌ఎస్‌కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్‌ సర్వే(ప్రీపోల్‌ సర్వే) కాంగ్రెస్‌ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్‌ఎస్‌ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్‌ తన ప్రీపోల్‌ సర్వేను బయటపెట్టింది.

ఇక ఆరా మస్తాన్‌ సర్వేలోని కొన్ని హైలెట్స్‌ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్‌లో నిలిచిన బర్రెలక్క(అలియాస్‌ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది.

ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా..

  • 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు
  • నిర్మల్లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్
  • ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్
  • బాల్కొండలో మంత్రి  ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం
  • కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్
  • సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్
  • సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్
  • దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్
  • తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్
  • మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్
  • అంబర్ పేటలో కారుకే ఛాన్స్
  • తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు
  • వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్
  • కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్
  • బర్రెలక్క కి 10 వేల ఓట్లు
  • ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు
  • కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు
  • హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్
  • మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్
  • ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్
  • పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది
  • కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)