Breaking News

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌పై తరుణ్‌ చుగ్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 08/09/2023 - 15:46

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడకముందే పొలిటికల్‌ హీట్‌ చోటుచేసుకుంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌.. కేసీఆర్‌ సర్కార్‌పై సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, తరుణ్‌ చుగ్‌ ఎల్బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 
ఎంఐఎం చేతితో కారు స్టీరింగ్‌ ఉంది. తెలంగాణలో కేసీఆర్‌ అవినీతి పాలన కొనసాగుతోంది. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఐదు లక్షల స్కీమ్‌ ఎందుకు అమలు చేయడం లేదు. కుటుంబ పాలన, దుష్ట పాలన నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది కేవలం బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్‌. 

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోని నెట్టారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు. మెట్రో నగరమైన హైదరాబాద్‌కు కేంద్రం నిధులు ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోంది. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరుతో కేసీఆర్‌.. ప్రజలను మోసం చేస్తున్నాడు. దీనిలో కేంద్రం నిధులున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో ప్రతీ గ్రామంలో స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ల విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్‌ స్పీచ్‌.. టార్గెట్‌ ఫిక్స్‌, ఇక సమరమే!

Videos

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు