Breaking News

బీజేపీ 400 లక్ష్యానికి ఈ 32 సీట్లు కీలకం!

Published on Thu, 04/11/2024 - 07:02

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవైపు బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇండియా కూటమి.. బీజేపీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి గెలిస్తే, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేసినట్లవుతుంది. నెహ్రూ 1951–52, 1957, 1962లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, అందులో బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇప్పటికే నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కమలదళం 2019లో తొలిసారిగా గెలిచిన 32 లోక్‌సభ స్థానాలను తిరిగి గెలుచుకోవడం  ఎంతో ముఖ్యం.

ఈ కీలకమైన సీట్లలో పశ్చిమ బెంగాల్‌ నుంచి 16, హర్యానా నుంచి 3, కర్ణాటక నుంచి 3, ఒడిశా నుంచి 3, తెలంగాణ నుంచి 2, త్రిపుర నుంచి 2 సీట్లు ఉన్నాయి. ఒక సీటు అస్సాం నుండి, ఒక సీటు మహారాష్ట్ర నుండి, ఒక సీటు మణిపూర్ నుండి కూడా గెలుచుకోవాల్సివుంది.  

2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా 16 సీట్లు గెలుచుకుంది. అలాగే హర్యానాలోని సిర్సా, హిసార్, రోహ్‌తక్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే విధంగా కర్ణాటకలోని చామరాజనగర్, చిక్కబల్లాపూర్, కోలార్ స్థానాలను కూడా గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ మొదటిసారి మూడు స్థానాలను గెలుచుకుంది. 

2019లో తొలిసారిగా తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది త్రిపుర పశ్చిమ, త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా  ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ తన ఖాతా తెరవడంలో విజయం సాధించింది. 2019లో తొలిసారిగా అసోంలో బీజేపీ 9 సీట్లు గెలుచుకుంది.
2019లో తొలిసారిగా మహారాష్ట్రలో మాధాలో బీజేపీ విజయం సాధించింది. ఇన్నర్ మణిపూర్ సీటును గెలుచుకోవడం ద్వారా, బీజేపీ 2019లో మొదటిసారి మణిపూర్‌లో తన ఖాతాను తెరిచింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)