Breaking News

తెలంగాణ బీజేపీ చీఫ్‌ నియామకంపై సస్పెన్స్‌

Published on Tue, 07/30/2024 - 11:03

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ చీఫ్‌ నియామకంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.

మరోవైపు, ఈసారి సంఘ్‌ పరివార్‌ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్‌కు తెరపడే చాన్స్ ఉంది.

 

 


 

 

 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)