Breaking News

నటుడు మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షోలో రాళ్ల దాడి

Published on Wed, 05/22/2024 - 07:10

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మరో అల్లర్ల ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో నటుడు,  బీజేపీ నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్నాపూర్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపుపై గాజు సీసాలు, రాళ్లు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర అధికార టీఎంసీ కొట్టిపారేసింది. కాగా ఈ ఘటనలో చక్రవర్తి, పాల్  ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

మిడ్నాపూర్‌ కలెక్టరేట్ మలుపు నుండి ప్రారంభమైన రోడ్ షో కెరనిటోలా వైపు వెళుతుండగా వందలాది మంది బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, మిథున్‌ చక్రవర్తి, అగ్నిమిత్ర పాల్ జనానికి అభివాదాలు తెలిపారు. ఈ రోడ్ షో షేక్‌పురా మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపక్కన నిలుచున్న కొందరు ఊరేగింపుపై రాళ్లు, సీసాలు విసిరారు. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగడంతో ఘర్షణ చెలరేగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి గూండాయిజానికి పాల్పడుతోందని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. మిథున్ చక్రవర్తి లాంటి ప్రముఖ నటుడిని అవమానించేలా వారు ప్రవర్తించారన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య  బీజేపీ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రోడ్ షో ఫ్లాప్ కావడంతో బీజేపీ  ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)