Breaking News

సీపీఎం పోటీ చేయని చోట కాంగ్రెస్‌కు మద్దతు: సీతారాం ఏచూరి

Published on Sat, 11/25/2023 - 12:27

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్‌ వస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. 

దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు.  బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు.

‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది.

నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి,  పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి.  ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు.
చదవండి: మోదీ-కేసీఆర్‌ ఫెవికాల్‌ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)