Breaking News

సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముసలం.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..

Published on Wed, 06/28/2023 - 15:10

బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు  కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారు.. కానీ తానైతే ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకాలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెంపెగడౌ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్‌ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు. 

2017లో కర్ణాటకాలో సీఎం సిద్ధరామయ్య  కాలంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 'సీఎం భయపడ్డారు కానీ నీనైతే ప్రాజెక్టుని పూర్తి చేసేవాడిని' అని అన్నారు. అయితే.. డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకాలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయం వరించింది. ఆ తర్వాత సీఎం పీఠం విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెద్ద కథే నడిచింది. చివరికి కేంద్రం బుజ్జగింపుతో డీకే వెనక్కి తగ్గగా సిద్ధరామయ్య సీఎం పదవిని స్వీకరించారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేప్టటారు. అయితే..  తాజాగా డీకే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయంలో మరోసారి ఇరువురి నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ కొనసాగుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఇదీ చదవండి: అక్కడ కాంగ్రెస్‌ దూకుడు.. బీజేపీ వెనుకంజ! 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)