Breaking News

ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..

Published on Wed, 08/16/2023 - 18:26

ముంబయి: ఇటీవల శరద్‌ పవార్‌, అజిత్ పవార్‌ల భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జట్టు కడుతున్న ఇండియా కూటమిని చెదరగొట్టేందుకు అజిత్ పవార్ నేతృత్వంలో వ్యూహం నడుస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తు కుదిరితే శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని వినికిడి. దీనిపై ఆయన ఏం చెప్పారంటే..?

పుణెలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో శరద్ పవార్‌, అజిత్ పవార్‌లు భేటీ అయ్యారు. అజిత్‌ పవార్ వర్గం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంతో కలిసిన నెలరోజుల తర్వాత చిన్నాన్న శరద్‌ పవార్‌ను కలిశారు. అయితే.. ఈ నెలఖరున ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష కూటమికి షాక్‌ ఇచ్చే విధంగా శరద్‌ పవార్‌ను బీజేపీతో కలిసేలా అజిత్‌ పవార్ ఒప్పించే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకున్నారు. 

ఈ పుకార్లపై మాట్లాడిన శరద్ పవార్.. అలాంటి చర్చలేవీ జరగలేదని స్పష్టం చేశారు. కొంతమంది శ్రేయోభిలాషులు తనను బీజేపీతో పొత్తు కుదిరేలా ఒప్పించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదని కూడా పేర్కొన్నారు. అజిత్ పవార్‌తో సమావేశం జరిగినట్లు పేర్కొన్న ఆయన.. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.

కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. పార్టీ పెద్దగా తనకు ఏం ఆఫర్ ఇవ్వగలరని అన్నారు. అజిత్ పవార్‌తో సాధారణంగానే సమావేశం జరిగిందని శరద్ పవార్‌ గతంలో కూడా చెప్పారు. 

అయితే.. శరద్ పవార్ భేటీ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) కూటమిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరద్ పవార్‌ను భీష్మ పితామహగా పేర్కొన్న ఎంపీ సంజయ్ రౌత్.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఎలాంటి పనులను శరద్ పవార్ చేయరని ధీమా వ్యక్తం చేశారు.

ముంబయిలో ఆగష్టు 31న ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిణామాలు మహాకూటమిని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విభజించడమే బీజేపీకి తెలిసిన పని అని శరద్ పవార్ విమర్శించారు. యథావిధిగా కూటమి భేటీ జరుగుతుందని అన్నారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌..ఎల్జీ అభ్యంతరం

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు