Breaking News

లోక్‌సభ ఎన్నికల బరిలో సమోసా బాబా

Published on Sat, 03/30/2024 - 09:11

ఛత్తీస్‌గఢ్‌లో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే అజయ్‌ పాలి అలియాస్‌ సమోసా బాబా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కవర్ధా జిల్లాకు చెందిన సమోసా బాబా.. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు. 

కవర్ధా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై  ఈ సమోసా బాబా 20 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. నగరంలోని జనం అజయ్‌పాలిని సమోసా బాబా అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే ఈయన ఇప్పుడు నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు. 

ప్రస్తుతం రూ. 5కు ఒక సమోసా విక్రయించే అతని దుకాణం  ముందు జనం క్యూ కడుతుంటారు. ఈ సమోసా బాబా ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇప్పుడు రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఇక్కడి జనం బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు తనకు అవకాశం కల్పిస్తారని సమోసా బాబా చెబుతున్నారు. బడా నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోరని సమోసా బాబా ఆరోపిస్తున్నారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానన్నారు.  

అజయ్ పాలీ 2008 నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో  సమోసా బాబా పోటీ చేశారు. తాజాగా ఆయన రూ. 25 వేలు వెచ్చించి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)