Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌..! ‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు

Published on Tue, 01/07/2025 - 17:00

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)కు తాము మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌(Akilesh Yadav) ప్రకటించారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ వేరువేరుగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్‌ కాంగ్రెస్‌కు కాకుండా ఆప్‌కు మద్దతు ఇ‍స్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అఖిలేష్‌ మద్దతు తెలపడంపై కేజ్రీవాల్‌(Kejriwal) స్పందించారు. అఖిలేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అఖిలేష్‌ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్‌ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్‌ కార్యక్రమంలోనూ అఖిలేష్‌ పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణ పోరు జరగనుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్‌,బీజేపీ మధ్యే ఉండనుంది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 5న జరగనుంది.

ఇదీ చదవండి: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)