Breaking News

కోదాడ నియోజకవర్గం ఘన చ‌రిత్ర..ఇదే

Published on Wed, 08/09/2023 - 12:52

కోదాడ నియోజకవర్గం

కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, సిటింగ్‌ ఎమ్మెల్యే ఎన్‌. పద్మావతి రెడ్డిపై 756 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. పద్మావతిరెడ్డి పిసిసి అద్యక్షుడు ఉత్తం  కుమార్‌ రెడ్డి సతీమణి. ఉత్తం, పద్మావతిలు 2014లో  ఇద్దరూ ఒకే అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు.

ఉత్తంకుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి గెలిస్తే పద్మావతి కోదాడలో విజయం సాదించారు. కాని 2018లో  పద్మావతి ఓటమి చెందారు. పద్మావతి మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీచేశారు. మల్లయ్యయాదవ్‌కు 89715 ఓట్లు రాగా, పద్మావతి రెడ్డికి 88359 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన అంజియాదవ్‌కు 5200 ఓట్లు వచ్చాయి. బొల్లం మల్లయ్య సామాజిక పరంగా యాదవ వర్గానికి చెందినవారు. 2014లో  నల్లమాడ పద్మావతి తన సమీప ప్రత్యర్ధి, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది మల్లయ్య యాదవ్‌పై 13374 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

1978లో ఇక్కడ జనతా పక్షాన గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు  అంతకు ముందు హుజూర్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్‌ పక్షాన గెలిచారు. ఈయన కాసు, పి.వి మంత్రివర్గాలలో పనిచేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ ఐ పక్షాన ఇక్కడ రెండుసార్లు, కొత్తగా మళ్ళీ ఏర్పడిన హుజూర్‌నగర్‌లో మూడుసార్లు గెలుపొందారు. 2019లో నల్గొండ ఎమ్‌.పిగా ఎన్నికవడంతో ఆయన హుజూర్‌ నగర్‌ సీటు వదలుకున్నారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో ఉత్తం భార్య పద్మావతి పోటీచేసి ఓడిపోయారు.

1983లో ఇక్కడ గెలిచిన వీరేపల్లి లక్ష్మీనారాయణ 1984లో నాదెండ్ల భాస్కరరావు నెలరోజుల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి మూడు సార్లు, జనతా పార్టీ ఒకసారి, టిఆర్‌ఎస్‌ ఒకసారి గెలిచాయి. టిడిపి పక్షాన వేనేపల్లి చందర్‌రావు నాలుగుసార్లు గెలుపొందారు. కోదాడలో మూడుసార్లు రెడ్డి సామాజికవర్గం, నాలుగుసార్లు వెలమ, ఒకసారి కమ్మ, ఒకసారి యాదవ, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి బిసి నేత గెలిచారు.

కోదాడ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు