మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు: రేవంత్‌ రెడ్డి

Published on Wed, 11/10/2021 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ భయంతోనే ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీని తిట్టినట్టు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ– కేంద్రహోంమంత్రి అమిత్‌షాల బంధం గట్టిదని, అందుకే కేసీఆర్‌ తన ప్రెస్‌మీట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తిడుతున్నారేకానీ ఆ పార్టీని పల్లెత్తు మాట అనడంలేదని అన్నారు.

కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు నాటు సరసంలా ఉన్నాయని, కాంగ్రెస్‌ను గేమ్‌ నుంచి తప్పించాలన్న వ్యూహం తోనే ఆయన ప్రెస్‌మీట్లు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌ కొంపల్లిలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రస్థాయి శిక్షణా తర గతులు ప్రారంభమైన సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ‘కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని నిర్మల్‌ సభలో అమిత్‌షా చెప్పారు, కానీ వారి మధ్య ఉన్న బంధంతోనే కేసీఆర్‌ ధైర్యంగా ఉంటున్నారు’ అని పేర్కొన్నారు.

దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టిన ఢిల్లీ పెద్దలు కేసీఆర్‌ కుటుంబాన్ని మాత్రం టచ్‌ చేయలేదన్నారు.  బండి సంజయ్‌ను సవాల్‌ చేసిన కేసీఆర్‌కు మోదీని సవాల్‌ చేసే దమ్ముందా అని రేవంత్‌ ప్రశ్నించారు.    

Videos

ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏర్పాటు: సీపీ

ఒకే రోజు రిలీజ్ అవుతున్న టాలీవుడ్ మూవీస్

పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?

వంశీకృష్ణ పై కోలా గురువులు ఫైర్

బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...

శృంగార తార కేసు..ట్రంప్ కు జైలు శిక్ష

KSR Live Show: మరో నిమ్మగడ్డలా ముకేశ్ కుమార్ మీనా

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!

మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు

Photos

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)