Breaking News

దీని వెనుక ఏదో మతలబు ఉంది: ఎంపీ లక్ష్మణ్‌

Published on Fri, 12/27/2024 - 16:07

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్‌ఎండీఏకు అవతల ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్‌మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్‌ చెప్పారు.

ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)