Breaking News

ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా... 

Published on Thu, 11/02/2023 - 03:13

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్‌ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో  సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ  ఓ రికార్డే. 

♦ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
♦  ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్‌ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 
♦ 1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్‌ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)