Breaking News

రంగారెడ్డి జిల్లా.. విభిన్నతల ఖిల్లా!

Published on Mon, 04/29/2024 - 07:28

సాక్షి, హైదరాబాద్: పల్లె.. పట్నం కలబోత. భౌగోళికంగా ఏడు జిల్లాల సరిహద్దులతో విస్తరించి ఉన్న అరుదైన ఘనత. తెలంగాణలోనే శరవేగంగా విస్తరిస్తోంది రంగారెడ్డి జిల్లా. ఐటీ, పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో దూసుకుపోతోంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ జిల్లా ప్రస్తుతం కొంత విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా అయిదు లోక్‌సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉండటం.. ఇటు రాజకీయంగానే కాదు అటు పరిపాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతుండటంతో ఎన్నికల రిటరి్నంగ్‌ అధికారులకే కాదు, పోలీసు యంత్రాంగానికి కొత్త చిక్కులు తప్పడం లేదు.  

దేశంలోనే మొదటి స్థానంలో మల్కాజిగిరి.. 
దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జాబితాలో మల్కాజిగిరి మొదటిస్థానంలో ఉంది. మల్కాజిగిరి. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కంటోన్మెంట్, మేడ్చల్‌ సహా జిల్లాలోని ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్‌ పరిధిలో కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 37,28,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎల్బీనగర్‌ ఓటర్లే 6,00,552 మంది ఉండటం విశేషం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో జిల్లా పరిధిలోని ఎల్బీనగర్‌కు చెందిన ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారు.  

తెలంగాణలో చేవెళ్ల రెండోది.. 
తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న రెండో అతిపెద్ద లోక్‌సభ స్థానంగా చేవెళ్లకు గుర్తింపు ఉంది. వికారాబాద్, పరిగి, తాండురు సహా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం 29,19,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లికి చెందిన వారే 21,72,811 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.  

అక్కడి అభ్యర్థులు..ఇక్కడి ఓటర్లు 
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో 18,04,930 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 3,37,134 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఇక్కడే ఉండటం, అభ్యర్థుల గెలుపోటములు వీరిపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి.  

⇒ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలో కొనసాగుతోంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉండగా, వీరిలో కల్వకుర్తికి చెందిన వారు 2,43,098 మంది ఉన్నారు.  

⇒ షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. ఈ స్థానంలో 16,80,417 మంది ఓటర్లు ఉండగా, వీరిలో షాద్‌నగర్‌ ఓటర్లే 2,38,392 మంది ఉన్నారు. ఆయా పారీ్టల అభ్యర్థుల జయాపజయాలను జిల్లా ఓటర్లే నిర్దేశించనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)