ముస్లింల గడ్డపై బీజేపీ జెండా.. లాలు, అఖిలేష్‌ రాజకీయాలకు అడ్డుకట్ట?

Published on Sun, 11/24/2024 - 11:58

లక్నో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గల రామ్‌గఢ్, యూపీలోని మొరాదాబాద్ జిల్లాలోని కుందర్కి సీటు ఒక ‍ప్రత్యేకతను దక్కించుకున్నాయి. ముస్లింల ప్రాబల్యం కలిగిన ఈ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది.

ఈ పరిణామంపై పలువురు రాజకీయ నిపుణులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇది దేశంలో మారుతున్న  ఓటర్ల సెంటిమెంట్‌ను తెలియజేసే విజయమని వారంటున్నారు. అలాగే రానున్న కాలంలో ఎన్నికల రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు.  రామ్‌గఢ్ సీటు మేవాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా అత్యధికం.  అలాగే పంజాబీ, రాజ్‌పుత్, బనియా, సిక్కు,  ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలన్నీ హిందూ-ముస్లిం వాదనపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక కుందర్కి  కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇక్కడ జనాభాలో 60 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ సీటును చివరిసారిగా 1993లో బీజేపీ గెలుచుకుంది. ముస్లిం మహిళల్లో గణనీయమైన వర్గం బీజేపీకి ఓటు వేస్తున్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి.

దేశ రాజకీయాల్లో అఖిలేష్ యాదవ్, లాలూ యాదవ్, మమతా బెనర్జీలు తమ తమ రాష్ట్రాల్లోని ముస్లిం ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు నేతలు ఉంటున్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా  అధికంగానే ఉంది. కాగా యూపీ, బీహార్‌లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల పార్టీలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల రాజకీయాలకు  అడ్డుకట్ట పడినట్లయ్యింది. మైనారిటీ ఆధిపత్య స్థానాలపై బీజేపీ సాధించిన విజయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో అఖిలేష్, లాలూల రాజకీయాలకు తాళం  పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)