Breaking News

శశి థరూర్‌ కీలక వ్యాఖ్యలు.. రాజీవ్ చంద్రశేఖర్ ఘాటు సమాధానం

Published on Tue, 04/23/2024 - 13:04

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్​లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు 'శశి థరూర్' తనమీద చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.

తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. ఒక ఎంపీ ఎంత చేయగలడో, చేయలేడో అర్థం కావడం లేదని, అతనికి 'అవగాహన లేదు' అని రాజీవ్ చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపైన రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పని చేయని వ్యక్తి నుంచి తనకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు.

నేను ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నప్పుడు.. కొన్ని సమస్యలు నా దృష్టికి వస్తాయి. వాటిని నేను తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరశాల నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై స్థానికులతో ముచ్చటించారు. చాలా మంది ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

ఇది (పరశాల) ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం, చాలా మంది ప్రజలు సాంప్రదాయ వ్యవసాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎటువంటి పురోగతిని చూడలేదు. ఉద్యోగాలు, అభివృద్ధి లేకుండా విసిగిపోయారు. అధిక నిరుద్యోగిత రేటు గురించి యువత ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)