Breaking News

రాహుల్‌ గాంధీకి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు

Published on Sat, 12/16/2023 - 19:40

ఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ అ‍గ్రనేత రాహుల్‌ గాంధీకి మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకు శనివారం సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో రాహుల్‌ను కోరింది.  

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్‌ గాంధీపై కేసు నమోదు అయ్యింది.  షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నాలుగేళ్ల కిందట(2018, ఆగస్టు 4వతేదీన) బీజేపీ నేత విజయ్‌ మిశ్రా కేసు వేశారు. సుల్తాన్‌పూర్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. చివరకు.. 

నవంబర్‌ 18వ తేదీతో వాదనలు పూర్తి కాగా, జడ్జి యోగేష్‌ యాదవ్‌ తీర్పును రిజర్వ్‌చేశారు. తర్వాత విచారణ నవంబర్‌ 27వ తేదీన జరగ్గా.. రాహుల్‌ గాంధీని డిసెంబర్‌ 16వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కోర్టుకు రాహుల్‌ గాంధీ రాలేదు. దీంతో జనవరి 6వ తేదీన కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని సమన్లు జారీ అయ్యాయని విజయ్‌ మిశ్రా తరఫు లాయర్‌ సంతోష్‌పాండే వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)