Breaking News

రఘువీర్‌రెడ్డి రికార్డు మెజారిటీ

Published on Wed, 06/05/2024 - 04:10

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రికార్డు నమోదైంది. నల్లగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి 7,84,337 ఓట్లురాగా.. సమీప బీజే పీ అభ్యర్థి సైదిరెడ్డికి 2,24,431 ఓట్లు వచ్చాయి. అంటే రఘువీర్‌రెడ్డి 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. 

తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ. ఇంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా గెలిచిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు 3,97,029 ఓట్ల మెజారిటీ లభించింది. 

అయి తే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగానూ గెలిచిన ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక అదే ఎన్నికల్లో వరంగల్‌ నుంచి గెలిచిన కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్‌) 3,92,574 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీగా విజ యం సాధించిన పసునూరి దయాకర్‌కు 3,50,298 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇప్పుడు వాటిని బ్రేక్‌ చేస్తూ రఘువీర్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో పీవీ.. 
ఉమ్మడి రాష్ట్రంలో పరిశీలిస్తే.. అత్యధిక మెజారిటీ మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేత పీవీ నర్సింహారావు పేరిట ఉంది. 1991 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుంచి పోటీచేసి 5,80,297 ఓట్ల మెజారిటీ సాధించారు. తర్వాత 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)