Breaking News

‘కేజ్రీవాల్‌ అవుట్‌ కాలేదు.. రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారంతే’

Published on Sat, 05/11/2024 - 15:08

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  వ్యక్తి కాదని.. ఆయన ఒక సిద్ధాంతమని పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ అన్నారు. వ్యక్తిని అర్టెస్‌ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్నిఅరెస్ట్‌ చేయలేరని అన్నారు. ఢిల్లీలో ఆప్‌ నిర్వహించిన బహిరంగ సభలో భగవంత్‌ సింగ్‌  పాల్గొని మాట్లాడారు.

‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశంలోనే అత్యంత ప్రజాదారణ కలిగి ఉన్న నేత. ఆయన విషయంలో ఏం జరగిందో మొత్తం దేశం చూసింది. దేశంలో అరవింద్‌ కేజ్రీవాల్ వ్యక్తి కాదు.. ఒక సిద్ధాంతం. వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్ని అరెస్ట్‌  చేయలేరు. 

మే 25న బీజేపీ పని అయిపోతుంది. పంజాబ్‌లో 13 స్థానాల్లో ఆప్‌ గెలుస్తుంది. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ బ్యాటింగ్‌ చేయడానికి పోలిటికల్‌ పిచ్‌కు వచ్చారు. ఆయన అవుట్‌ కాలేదు. కేవలం రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. అదే రాజకీయ క్షేత్రంలోకి మళ్లీ తిరిగి వచ్చారు’’ అని భగవంత్‌ సింగ్‌ అన్నారు.

ఢిలీ మద్యం పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న(శుక్రవారం) మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు జూన్‌ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యత బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న తిరిగి తిహార్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

#

Tags : 1

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)