బాన్స్‌వాడ నియోజకవర్గం చరిత్ర ఇది

Published on Thu, 07/27/2023 - 15:34

బాన్స్‌ వాడ నియోజకవర్గం చరిత్ర ఇది

సీనియర్‌ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోసారి విజయం సాదించి 2018లో  స్పీకర్‌ పదవిని అదిష్టించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. బాన్స్‌వాడలో 2009 నుంచి వరసగా గెలుస్తున్న పోచారం 1994,99లలో  కూడా గెలిచారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రి వర్గంలో ఆయన పనిచేశారు. పోచారం తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది కామల బాలరాజ్‌పై 18485 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. పోచారానికి 77343 ఓట్లు రాగా, బాలరాజ్‌కు 59458 ఓట్లు వచ్చాయి. టిడిపితో రాజకీయ జీవితాన్ని ఆరంబించిన పోచారం 2009లో  టిడిపి పక్షాన గెలిచి, ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ప్రకాష్‌ నాయిడుకు మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి.

బాన్స్‌వాడలో గెలిచిన పోచారం రెడ్డి సామాజికవర్గం వారు. బాన్స్‌వాడలో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు విజయం సాధిస్తే, మూడుసార్లు  బిసి నేతలు, నాలుగు సార్లు కమ్మ సామాజికవర్గం నేతలు, ఒకరు ఎస్‌.టి కాగా ఒకరు ఇతర వర్గాల నుంచి ఎన్నికయ్యారు. 1952లో ఏర్పడిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐలు కలిపి ఏడుసార్లు గెలిస్తే, టిడిపి ఆరుసార్లు, టిఆర్‌ఎస్‌ మూడుసార్లు  విజయం సాధించాయి. 1983లో టిడిపి ఆవిర్భావం తరువాత ఒకసారి తప్ప  రెండువేల తొమ్మిది వరకు ఆ పార్టీనే గెలిచింది ఒక్క 2004లోనే ఇక్కడ ఓడిపోయింది. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ కైవసం అయింది.

1967 నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ తరుఫున శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచారు. ఆయన బోధన్‌ నుంచి కూడా ఒకసారి గెలిచారు. శ్రీనివాసరావు కొంతకాలం అంజయ్య మంత్రివర్గంలో ఉన్నారు. పరిగి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో  స్టేషనరీ కుంభకోణానికి న్కెతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసారు. 1952, 57లలో ఇక్కడ మహిళా అభ్యర్దులు గెలుపొందగా, 1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో బాన్స్‌ వాడలో  గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్‌ అంతకుముందు 1999లో ఆర్మూరులో నెగ్గారు. 2014,2018లలో  నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు.

బాన్స్‌ వాడలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)