Breaking News

కూటమిలో చిచ్చురేపిన చేరికలు?

Published on Wed, 12/25/2024 - 12:32

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్‌ వార్‌ నడుస్తోందనే చర్చ మొదలైంది.

తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)