Breaking News

Jharkhand Polls: ఐదుగురు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న ఒక బ్లాక్‌ ఓటర్లు

Published on Tue, 11/12/2024 - 12:08

హజారీబాగ్: జార్ఖండ్‌లోని దారు బ్లాక్‌లోని ఓటర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. 2008లో బ్లాక్ ఏర్పడినప్పటి నుంచి ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈ బ్లాక్‌లో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు హజారీబాగ్, బర్కతా, మండు గ్రామాలున్నాయి. దీంతో దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లు ఐదుగురు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.

హజారీబాగ్ జిల్లాలోని దారు బ్లాక్‌లో తొమ్మిది పంచాయతీలు, 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఈ కారణంగా  ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఎన్నికల పరిస్థితి ఏర్పడింది. దారూలోని  ఓటర్లు హజారీబాగ్, బర్కథా, మండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఇంతేకాదు వీరు హజారీబాగ్, కోడెర్మా లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలను కూడా ఎన్నుకుంటారు.

దారు బ్లాక్‌లోని 42,281 మంది ఓటర్లలో 21,398 మంది పురుషులు, 20,888 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా 1,272 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది పంచాయతీలను కలిసి దారు బ్లాక్‌ను రూపొందించినప్పటి నుంచి ఈ విచిత్ర పరిస్థితి  ఏర్పడింది. నవంబరు 13న జరిగే పోలింగ్‌కు దారు బ్లాక్‌లోని అన్ని పోలింగ్ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇది కూడా చదవండి: Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బరిలో 53 పార్టీలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)