Breaking News

పొన్నం ప్ర‌భాక‌ర్‌పై సంచలన ఆరోపణలు

Published on Tue, 06/11/2024 - 12:23

సాక్షి, క‌రీంన‌గ‌ర్‌:  కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అతిపెద్ద స్కాం చేశాడ‌ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండ‌గదండల‌తో రామగుండంలో ఫ్లై యాష్‌ బూడిద‌ను ఉచితంగా తరలిస్తున్నారని మండిప‌డ్డారు. ఎన్టీపీసీలో నుంచి వ‌స్తున్న యాష్‌ను లోడ్ రికార్డు లేకుండానే బయ‌ట‌కు పంపిస్తున్నార‌ని అన్నారు.  అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమ‌ర్శించారు. .

కలెక్షన్ బాయ్‌గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడ‌ని కౌశిక్ రెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్త‌లు రాస్తున్న రిపోర్ట‌ర్ల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు.  ఈ క్ర‌మంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టార‌ని తెలిపారు.

ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్ర‌భాక‌ర్‌ను ప్ర‌శ్నించారు. త‌మ ఆరోప‌ణ‌ల‌పై ద‌మ్ముంటే మంత్రి స్పందించాల‌ని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిప‌డ్డారు.

కాగా రెండు రోజుల క్రితం ఓవ‌ర్ లోడ్‌తో  రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.

రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)