Breaking News

Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే?

Published on Thu, 02/20/2025 - 10:48

న్యూఢిల్లీ: హర్యానాలోని జీంద్‌ జిల్లాకు చెందిన బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా ఈరోజు (ఫిబ్రవరి 20) ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా (Rekha Gupta) పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారని తెలియగానే హర్యానా బీజేపీ మాజీ అధ్యక్షులు ఓంప్రకాష్‌ ధన్కర్‌ (Om Prakash Dhankar) ఆమెకు 501 రూపాయలు ఇచ్చారు. దీనిని చూసినవారంతా ఆనందంతో ఆశ్చర్యపోయారు.

హర్యానాలో ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఓం ప్రకాష్‌ 501 రూపాయలను.. రేఖా గుప్తా ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆమెకు ఇచ్చారు. ఓంప్రకాష్‌ ధన్కర్‌ ఢిల్లీ సీఎం (Delhi CM) ఎంపికలో పర్యవేక్షకునిగా వ్యవహరించారు.  

రేఖా గుప్తాకు రూ. 501 ఇచ్చిన తరువాత ఓంప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ రేఖా మా హర్యానా (Haryana) ఆడపడుచు అని అన్నారు. 1974లో జన్మించిన రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. ఆమె గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 

తొలిసారి పోటీ చేసినప్పుడు ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తరువాత రేఖాగుప్తా ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేఖా గుప్తా తన ప్రత్యర్థి వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38,605 ఓట్లు వచ్చాయి. రేఖా గుప్తాకు 68,200 ఓట్లు దక్కాయి.

ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)