Breaking News

Maharashtra: ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. కుదిరిన ఒప్పందం?

Published on Mon, 11/25/2024 - 11:01

ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. తాజాగా జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎం ఏక్‌నాథ్ షిండేనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బహనా యోజనను సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రారంభించారని, ఇది మహాయుతికి  లబ్ధి చేకూర్చిందని వారు చెబుతున్నారు.

ఏక్‌నాథ్ షిండే సీఎం  అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని షిండే క్యాంపు అభిప్రాయపడింది.  అయితే బీజేపీకి అత్యధిక సీట్లు  దక్కినందున దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

కాగా మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఫడ్నవీస్‌ను సీఎం చేయడానికి మహాయుతిలోని అజిత్ గ్రూపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు.

ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి  కీలక పోర్ట్‌ఫోలియోలు ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం జరగనుంది.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ

ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)