Breaking News

అఖిలేష్‌పై డింపుల్‌ కళ్లు.. ‘సభ’లో సూపర్‌ సీన్‌

Published on Wed, 06/26/2024 - 13:08

18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్‌లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్‌ భార్య  భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్‌ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది. 

అఖిలేష్ నూతన స్పీకర్‌ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్‌ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ  ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.

మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి,  ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్‌సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.

మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్‌ అన్నారు. అఖిలేష్‌ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్‌ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ  ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఓం  బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)