Breaking News

ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు

Published on Mon, 05/20/2024 - 13:24

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద  ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.

గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని,  రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.

తాము ఇక్కడి రైల్వేలైన్‌పై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి  నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)