Breaking News

'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

Published on Mon, 07/03/2023 - 09:57

ముంబయి: ఎన్సీపీకి షాక్ ఇచ్చిన శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్‌.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన శరద్ పవార్.. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. కుటుంబంలో రాజకీయాల గురించి మాట్లాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.  

స్వాతంత్ర్య పోరాట నాయకుడు వై బీ చౌహాన్ స్మారకాన్ని దర్శించడానికి సతారాకు ఈ రోజు ఉదయమే శరద్ పవార్ వెళ్లారు. నిన్న నుంచి ఎవ్వరినీ తాను కలవలేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్‌ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయ పరమైన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.   

2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అయితే.. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం కలగదని శరద్ పవార్ చెప్పారు. బెంగళూరులో త్వరలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జులై 16-18 మధ్య ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ మేరకు రాజ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అజిత్‌ పవార్‌తో పాటు షరద్‌ పవార్‌కు నమ్మిన బంటు ఛగన్ భుజ్‌భల్, ప్రఫుల్ పటేల్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఏంపీలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది..

  


 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)