Breaking News

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ రాజకీయ చరిత్ర

Published on Thu, 07/27/2023 - 17:54

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం 

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి సిటింగ్‌ ఎమ్మల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్‌ 2018లో మరోసారి గెలిచారు. ఆయన అంతకుముందు ఒకసారి ఆర్మూరులోను, మరోసారి బాన్స్‌వాడలోను విజయం సాదించారు. బాజిరెడ్డి మొత్తం నాలుగుసార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికల ముందు అనూహ్యమైన రీతిలో బాజిరెడ్డి గోవర్దన్‌ టిఆర్‌ఎస్‌లో చేరి కాంగ్రెస్‌ ఐ ప్రముఖ నేత డి.శ్రీనివాస్‌ను ఓడిరచారు. తిరిగి మరోసారి ఇక్కడే ఆయన కాంగ్రెస్‌ ఐ సమీప ప్రత్యర్ది భూపతి రెడ్డిపై 25655 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భూపతి రెడ్డి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉంటూ టిక్కెట్‌ ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్‌ ఐలోకి మారి ఓటమి చెందారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌కు 87756 ఓట్లు రాగా భూపతి రెడ్డికి 57911 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన కేశుపల్లి ఆనందరెడ్డికి పదహారువేల పైచిలుకు ఓట్లు లభించాయి. బాజిరెడ్డి గోవర్ధన్‌ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. గతంలో డిచ్‌ పల్లి నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం నేతలు అత్యధికసార్లు గెలిచినా, ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం నేతలకు అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గం పునర్విభజన జరిగిన తర్వాత నిజామాబాద్‌ రూరల్‌గా మారింది. అంతకుముందు డిచ్‌పల్లి పేరుతో ఉండేది.

రద్దయిన డిచ్‌పల్లి, ఇప్పటి నిజామాబాద్‌ రూరల్‌  నియోజకవర్గంలో ఏడుసార్లు కమ్మ సామాజికవర్గం నేతలు గెలుపొందితే, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి(మున్నూరుకాపు) నేతలు ఎన్నికయ్యారు. సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు విజయం సాధించారు.  రద్దు అయిన డిచ్‌పల్లిలో  ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ ఐ రెండుసార్లు, టిడిపి ఐదు సార్లు, సోషలిస్టు పార్టీ మరోసారి గెలిచాయి.1983 నుంచి 2009 వరకు ఒక ఉప ఎన్నికలో తప్ప కాంగ్రెస్‌ ఎన్నడూ గెలవలేకపోయింది.

మండవ వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. టిఆర్‌ఎస్‌ పక్షాన 2004లో గెలిచిన గంగారెడ్డి అంతకుముందు టిడిపి తరుఫున మూడుసార్లు ఎమ్‌.పి.గా నెగ్గారు. 1991లో టిడిపి ఎమ్‌.పిగా గెలిచిన ఈయన పి.వి. ప్రభుత్వాన్ని రక్షించడానికి ఆయనకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్‌ ఐలోకి వెళ్లారు. 1998లో తిరిగి టిడిపిలోకి వచ్చి మరో రెండుసార్లు ఎమ్‌పి అయ్యారు. 2004 నాటికి టిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఈ పార్టీకి కూడా దూరం అయ్యారు. 2008 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసిన ఆకుల లలిత గెలిచారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో ఆమె ఆర్మూరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆమె టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

నిజామాబాద్‌ రూరల్‌లో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)