Breaking News

బీజేపీలో చేరిన సంచలన లాయర్‌

Published on Mon, 03/18/2024 - 21:52

Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్రాస్ సామూహిక అత్యాచారం, శ్రద్ధా వాకర్ హత్య వంటి ల్యాండ్‌మార్క్ కేసుల్లో బాధితుల తరపున వాదించి కుష్వాహా ప్రసిద్ధి చెందారు.

ఎవరీ సీమా కుష్వాహ?
సీమా కుష్వాహా 2022 జనవరిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి తరపున వాదించిన తర్వాత కుష్వాహాకు ఎనలేని గుర్తింపు లభించింది. మరోవైపు నిర్భయ జ్యోతి ట్రస్ట్‌ను స్థాపించి అత్యాచార బాధితుల తరపున న్యాయం కోసం వాదించే ప్రచారాన్ని కుష్వాహా ప్రారంభించించారు. కుష్వాహాతో పాటు ఉత్తరప్రదేశ్ లాల్‌గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్‌పీ ఎంపీ సంగీతా ఆజాద్ కూడా బీజేపీలో చేరారు. సంగీత భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా ఆమెతో పాటు కాషాయ శిబిరంలో చేరారు.

నిర్భయ అత్యాచారం కేసు 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై  2012 డిసెంబర్‌లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, దాడి చేసి రోడ్డు మీదకి తోసేశారు. బాధితురాలు చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న మృతి చెందారు. బాధితురాలికి న్యాయం చేయడానికి ఏడేళ్లు పట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులను 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)