Breaking News

చార్మినార్‌ నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..?

Published on Fri, 08/04/2023 - 13:34

చార్మినార్‌ నియోజకవర్గం

మజ్లిస్‌ పార్టీ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చార్మినార్‌ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్‌ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్‌ పురాకు మారి నాలుగోసారి విజయంసాదించగా, అహ్మద్‌ఖాన్‌ చార్మినార్‌ నుంచి గెలవడం విశేషం. అహ్మద్‌ ఖాన్‌ 1994లో ఎమ్‌.బి.టి తరపున గెలిచారు. ఆతర్వాత మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తున్నారు.

అహ్మద్‌ ఖాన్‌ తన సమీప బిజెపి ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఐ తరపున పోటీచేసిన మహ్మద్‌ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్‌ ఖాన్‌ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్‌ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్‌ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్‌ పక్షంవారే.

మజ్లిస్‌ పక్షానికి ఎన్నికల సంఘం గుర్తింపు లేనప్పుడు వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలుపొందారు. మజ్లిస్‌ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్‌ ఓవైసీ 1967, 1978, 83లలో చార్మినార్‌ నుంచి, 1962లో ఫత్తర్‌గట్టి నుంచి, 1972లో యాకుత్‌పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడిరచి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి, ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు.

సలావుద్దీన్‌ ఓవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్‌ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు శాసనసభకు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి నాలుగుసార్లు గెలుపొందారు. రెండో కుమారుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ 1999 నుంచి ఐదుసార్లు చాంద్రా యణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా చట్టసభలలో ఉండడం కూడా ఒక అరుదైన రికార్డు. 1989లో చార్మినార్‌లో  గెలుపొందిన విరాసత్‌ రసూల్‌ఖాన్‌ అంతకుముందు  రెండుమార్లు అసిఫ్‌నగర్‌ నుంచి 2009లో నాంపల్లి నుంచి  విజయం సాధించారు. చార్మినార్‌లో  గెలిచినవారంతా ముస్లింలే కావడం విశేషం.

చార్మినార్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు