Breaking News

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్‌ ఎవరు..?

Published on Thu, 08/10/2023 - 18:25

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం

వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్‌ విజయం సాదించారు. వరంగల్‌ మేయర్‌గా ఉన్న నరేందర్‌ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది పి.రవిచంద్రపై 28142 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తొలిసారి నరేందర్‌ గెలు పొందారు. ఆయనకు 82461 ఓట్లు రాగా, రవిచంద్రకు 54225 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన కె.సతీష్‌కు సుమారు 4700 ఓట్లు వచ్చాయి. నన్నపునేని నరేందర్‌ మున్నూరు  కాపు వర్గానికి చెందినవారు.

2014లో మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్‌ఎస్‌లో చేరి అప్పట్లో మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను   55085 ఓట్ల  ఆధిక్యతతో ఓడిరచారు. సురేఖ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉమ్మడి ఏపిలో 2009 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత, రోశయ్య మంత్రి వర్గంలో ఉంటూ  వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు మద్దతుగా పదవికి  రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌లో కొంతకాలం కీలక నేతగా ఉన్నారు.

కిరణ్‌ కుమార్‌ రెడ్డి  ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడిరది. తదుపరి పరకాలకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసి సుమారు 1500  ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తదుపరి తెలంగాణ అంశంలో  జగన్‌ తో వచ్చిన విబేధాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటపడి మళ్లీ  కాంగ్రెస్‌ ఐ లో చేరారు.

అక్కడ ఇమడలేక 2014 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరి వరంగల్‌ తూర్పు సీటును తీసుకుని గెలుపొందారు. ఒకప్పుడు ఈమెకు టిఆర్‌ఎస్‌ నాయకులకు, కెసిఆర్‌కు ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది ఆమె ఈ పార్టీ లోకి వచ్చి గెలుపొందడం విశేషం. గతంలో ఆమె శాయంపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ఆ నియోజకవర్గం 2009లో రద్దు అయింది.బసవరాజు సారయ్య  మూడుసార్లు ఎన్నికయ్యారు. రజక వర్గానికి చెందిన సారయ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు.

వరంగల్‌లో ఒకసారి గెలిచిన టి. పురుషోత్తంరావు గతంలోవర్ధన్నపేట నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంటుగా గెలిచిన బి. నాగభూషణరావు 1983, 85లలో టిడిపి తరుపున గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఎమ్‌.ఎస్‌.రాజలింగం ఇక్కడ ఒకసారి,  చిల్లంచెర్లలో మరోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన మీర్జాబేగ్‌, మరోసారి హనుమకొండలో నెగ్గారు.

పురుషోత్తంరావు గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోమంత్రిగా ఉండగా,  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రిమోట్‌ఏరియా అభివృద్ధి కమిటీ ఛ్కెర్మన్‌ పదవి ఇచ్చారు. వరంగల్‌ , వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలలో కలిపి ఒకసారి రెడ్డి, ఆరుసార్లు బిసి నేతలు,ఐదుసార్లు బ్రాహ్మణ, ఒకసారి వెలమ,ఒకసారి ముస్లిం,ఒకసారి కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)