Breaking News

కార్వాన్ నియోజకవర్గానికి కొత్త నాయకుడు ఎవరు..?

Published on Fri, 08/04/2023 - 12:50

కార్వాన్‌ నియోజకవర్గం

కార్వాన్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్ధి, సిటింగ్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, బిజెపి నేత అమర్‌సింగ్‌పై 49692 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన టి.జీవన్‌ సింగ్‌కు సుమారు 24600 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు స్నేహపక్షాలే అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా టిఆర్‌ఎస్‌ తన సొంత అభ్యర్దులను పెట్టడం ద్వారా మజ్లిస్‌కు సహకరించిం దనుకోవచ్చు.

మొయినుద్దీన్‌కు 85401ఓట్లు రాగా, అమర్‌సింగ్‌కు 35709 ఓట్లు వచ్చాయి. మొయినుద్దీన్‌ ముస్లిం నేత. కార్వాన్‌ నియోజకవర్గంలో 2014లో మజ్లిస్‌ ఈసారి సిటింగ్‌ ఎమ్మెల్యే అప్సర్‌ ఖాన్‌కు కాకుండా కొత్త అభ్యర్ధి మొయినుద్దీన్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డిని ఓడిరచారు. 1999లో ఎన్నికైన సయ్యద్‌ సజ్జాద్‌ మరణించడంతో 2003లో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా అప్సర్‌ఖాన్‌  ఎన్నికయ్యారు. అయితే అప్పుడు కేవలం మూడు నెలలు మాత్రమే ఈయన పదవిలో ఉన్నారు. అంతలో అసెంబ్లీ రద్దు అయిపోయింది. తిరిగి 2004లో తదుపరి 2009లో గెలిచారు.

2014లో టిక్కెట్‌ ఇవ్వలేదు. అంతకుముందు బిజెపి నేత బద్దం బాల్‌రెడ్డి  మూడుసార్లు గెలిచారు. 1983లో  ఇక్కడ గెలిచిన బాకర్‌ అగా 1978లో యాకుత్‌పురా నుంచి గెలిచారు.  సయ్యద్‌ సజ్జాద్‌ 1989లో ఆసిఫ్‌నగర్‌లో, 1999లో కార్వాన్‌లో గెలిచారు.  కార్వాన్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి రెండుసార్లు, బిజెపి మూడుసార్లు, ఎమ్‌.ఐ.ఎమ్‌ ఆరుసార్లు, ఇండి పెండెంటు ఒకసారి విజయం సాధించారు. ఇక్కడ మూడుసార్లు  రెడ్డి నేతలు, ముస్లింలు తొమ్మిది  సార్లు , బిసిలు రెండుసార్లు గెలుపొందారు.

కార్వాన్‌ నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు