Breaking News

'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్‌..

Published on Wed, 07/05/2023 - 19:59

ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్‌ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు.

'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద‍్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు.

నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప‍్రదర్శన జరిగింది. ఇందులో అజిత్‌ పవార్‌ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్‌ పవార్‌ వెనుక కేవలం 17 మంది మాత్రమే  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం​ ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ చెబుతున్నారు.

ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)