Breaking News

బీజేపీలోకి నవనీత్‌ రాణా.. అమరావతి నుంచి పోటీ!

Published on Thu, 03/28/2024 - 06:59

మహారాష్ట్రలోని అమరావతి సిట్టింగ్‌ ఎంపీ నవనీత్ రాణా అధికారికంగా బీజేపీలో చేరారు. నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే నవనీత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికిముందు అమరావతి (రిజర్వ్డ్ స్థానం) నుంచి పార్టీ అభ్యర్థిగా నవనీత్ రాణాను బీజేపీ ప్రకటించింది. 

బీజేపీలో చేరిన నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నానని అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వారిని ప్రధాని మోదీ ప్రోత్సహిస్తారని, ఈ విధంగానే తనకు టిక్కెట్‌ కేలాయించారన్నారు. తన శ్రమను బీజేపీ గుర్తించిందని, ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి 400 సీట్లు దాటాలనే బీజేపీ సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ఇకపై తాను బీజేపీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. 

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు స్వతంత్రులు గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. వారిలో నవనీత్ రానా కూడా ఒకరు. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబీ కుటుంబానికి చెందిన నవనీత్ కౌర్‌.. రవి రానాతో పెళ్లి తర్వాత రానాను తన పేరులో చేర్చుకున్నారు. 

నవనీత్ కౌర్, రవి రాణా యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆశ్రమంలో కలుసుకున్నారు. 2011లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎంపీ నవనీత్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు నవనీత్‌  మోడలింగ్‌లో తన కెరియర్‌ ప్రారంభించారు. తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించారు. నవనీత్ పెళ్లి తర్వాత రాజకీయాల్లో కాలుమోపారు. 2014లో ఎన్‌సీపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అమరావతి ఎంపీగా ఎన్నికయ్యారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)