Breaking News

చివరి విడతలో అఖిలేష్‌కు షాక్‌

Published on Thu, 05/30/2024 - 13:12

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బల్లియాకు చెందిన ప్రముఖ నేత నారద్ రాయ్ ఎస్పీతో తెగతెంపులు చేసుకుని, బీజేపీలో చేరారు. నారద్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నారద్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు, అతని కుమారుడు అఖిలేష్‌కు అతి సన్నిహితునిగా పేరొందారు.

నారద్ రాయ్ బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుని అతని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాయ్‌ ఒక ట్వీట్‌లో  తాను బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ‘బరువెక్కిన హృదయంతో నేను సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నాను. 40 ఏళ్ల రాజకీయ జీవితం అలానే ఉంది. ఇప్పుడు బీజేపీ కోసం నా బలాన్నంతా ఉపయోగిస్తాను. బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తాను. అఖిలేష్ యాదవ్ నన్ను అవమానించారు. గత ఏడేళ్లుగా  ఇదే జరగుతోంది. 2017లో అఖిలేష్‌ యాదవ్‌ నా టికెట్‌ రద్దు చేశారు. అయితే 2022లో తిరిగి టికెట్‌ ఇచ్చారు. అయితే అదే సమయంలో నా ఓటమికి  కుట్ర పన్నారు’ అని పేర్కొన్నారు.

యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో నారద్ రాయ్ రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని వీడి, బీఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటున్నారు.

ఇటీవల బల్లియా లోక్‌సభ ఎస్పీ అభ్యర్థి సనాతన్ పాండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో నారద్ రాయ్ పాల్గొన్నారు. అయితే  నాడు ఎస్‌పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఈయన పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆగ్రహించిన నారద్‌ రాయ్‌‌ ఎస్పీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు