ఈ ఎన్నికల యుద్ధంలో మోదీదే విజయం

Published on Mon, 03/11/2024 - 21:51

సాక్షి, కోల్‌కతా : రాబోయే లోక్‌సభ ఎన్నికలకు, మహాభారతానికి మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎన్నికలు మంచి - చెడు, ధర్మం - అన్యాయం మధ్య జరిగే యుద్ధం అంటూ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ కేంద్ర మంత్రి మాట్లాడారు. 

దేశ భద్రత, శ్రేయస్సు, అందరి సాధికారత కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ యుద్ధంలో విజయం సాధిస్తారని పునరుద్ఘాటించారు. మోదీ పాండవుల మాదిరిగానే న్యాయం, నైతికత, ధర్మం కోసం పాటుపడుతుంటే ..ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశిస్తూ కౌరవులు దేశ ప్రపంచ కీర్తిని మసకబారడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

ప్రగతి పథంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ప్రధాని మోదీ దేశ దైవత్వాన్ని, గౌరవాన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఎప్పటికీ ప్రజాస్వామ్య వైభవాన్ని హైజాక్ చేయలేవని తెలిపారు. 

మైనార్టీలు బీజేపీ వెంటే ఉన్నారని, అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ తమ పట్ల వివక్ష చూపనప్పుడు, బీజేపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించాలని మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)