బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా? 

Published on Mon, 11/06/2023 - 05:00

నగరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలివా.. చంద్రబాబుకు తొత్తువా... అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆదివారం బాపట్ల జిల్లా నగరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల కోసం, భవిష్యత్‌ కోసం పనిచేస్తున్నారో.. టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని పురందేశ్వరిని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ పా ర్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రైతులను, ప్రజల్ని మోసం చేశారంటూ చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి.. నేడు ప్రజ­లపై టీడీపీ అజెండా రుద్దేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పురందేశ్వరి బీజేపీ నావ ఎక్కి.. టీడీపీ తెడ్డు తిప్పు­తున్నారని విమర్శి«ంచారు. ఏ అర్హతతో ఎంపీ విజయ­సాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని లేఖ రాశారో చెప్పాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటా­్లడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్ర­బాబుతో పురందేశ్వరి కూడా ఉన్నారని చెప్పారు.

చంద్రబాబును కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. బీజేపీ అధ్యక్షురాలిలా ఆమె వ్యహరించడం లేదన్నారు. అవినీతికి పాల్పడి స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు జైలు­కు వెళితే ఆయనకు వత్తాసుగా పురందేశ్వరి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. పురందేశ్వరి పదే­పదే ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)