Breaking News

బీఆర్‌ఎస్‌ స్ట్రాటజీ.. ఎమ్మెల్సీగా దాసోజు!

Published on Mon, 07/31/2023 - 21:31

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా..  దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌ సైతం ఆయన పేరును మీడియా ముందు ప్రస్తావించారు కూడా. 

దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ కానుండటంతో.. ఖైరతాబాద్‌ నేతల మధ్య పోటీ చల్లబడినట్లయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు లైన్ క్లియర్ అయింది.  దీంతో ఖైరతాబాద్ నుంచి దానం మళ్లీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నల్లగొండకు చెందిన దాసోజు శ్రవణ్‌ కుమార్‌.. వక్తగా, సబ్జెక్ట్‌పై గ్రిప్‌ ఉన్న మేధావిగా పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ, టీ(బీ)ఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో పని చేసిన శ్రవణ్‌.. తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరికతో ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం అందిపుచ్చుకున్నారు.  ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టీ(బీ)ఆర్ఎస్ తరపున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

ఆపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా & కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్‌ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (తెలంగాణ) అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్‌మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)