Breaking News

సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్‌!

Published on Mon, 09/09/2024 - 11:45

సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్‌ టు రిచ్‌కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్‌ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్‌లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

డ్రెడ్జింగ్‌ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్‌ అండ్‌ ఫెర్రీ బోర్డ్‌ వర్కర్స్‌ అండ్‌ అదర్‌ వర్క్స్‌ లేబర్‌ కాంట్రాక్ట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్‌ వద్దకు పంపి డ్రెడ్జింగ్‌ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్‌నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.

చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్‌ ఓవరాక్షన్‌ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్‌ నుంచి కాంట్రాక్ట్‌ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్‌ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.

ఇదీ చదవండి:  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి

ఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్‌ తోలి రీచ్‌కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు.


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)